పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కొవ్వూరు నుంచి హైదరాబాద్ కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న అయిదు ఇసుక లారీలను పట్టుకుని బుట్టాయగూడెం పోలీసులకు అప్పగించారు.
దొరమామిడి మీదుగా తెలంగాణ రాష్ట్రం తరలిస్తుండగా ఎమ్మెల్యే లారీలను ఆపి వివరాలు కనుక్కున్నారు. లారీ చోదకులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అయిదు లారీలను బుట్టాయగూడెం పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: ప్రస్తుతం స్థానిక ఎన్నికల నిర్వహణ కష్టం: ప్రభుత్వం