పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొప్పినీడి నరసింహమూర్తి (ముసిలియ్య) దారుణ హత్యకు గురయ్యాడు. ఇతను ఒకప్పుడు రౌడీషీటర్‌గా ఉన్నాడని పోలీసులు తెలిపారు. కుటుంబసభ్యుల తెలిపిన వివరాలు ప్రకారం... బ్యాంకు కాలనీలో నరసింహమూర్తి నడిచి వెళుతుండగా దుండగులు కత్తితో దారుణంగా నరికి పరారయ్యారు. తీవ్రగాయాల పాలైన నరసింహమూర్తిని భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి