ETV Bharat / state

Pawan kalyan: జగన్‌ను ప్రజలు ఎలా నమ్మారో అర్థం కావట్లేదు: పవన్‌ - భీమవరంలో జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

Pawan kalyan: జనవాణి కార్యక్రమంలో అవినీతి, ఇళ్ల పట్టాలు, మౌలిక వసతుల గురించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని జనసేనాని అన్నారు. గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి అధికారంలోకి వచ్చిన వైకాపా ఇసుక దోపిడీకి పాల్పడుతోందని ప్రజలంటున్నారన్నారు. మేలు చేస్తాడని అధికారం అప్పగిస్తే.. అది భ్రమేనని తేలిపోయిందన్నారు. ప్రభుత్వం అరాచకం మొదలైన రోజు నుంచే జనసేన పోరాటం ప్రారంభమైందని పవన్​కల్యాణ్​ అన్నారు.

Pawan kalyan at janasena janavani programme
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనవాణి: పవన్ కల్యాణ్
author img

By

Published : Jul 17, 2022, 3:34 PM IST

Updated : Jul 17, 2022, 7:09 PM IST

Pawan kalyan: ఒక సినిమా రిలీజ్‌ అవుతుందంటే.. కలెక్టర్‌ నుంచి ఆర్డీవో వరకు అందరినీ రంగంలోకి దించుతారు. కానీ, ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు వ్యవస్థలు ఎందుకు పని చేయవని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన మూడో విడత జనసేన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పవన్‌.. వైకాపా తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.‘‘151 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలా అద్భుతాలు చేసి ఉండొచ్చు. రాష్ట్రంలో అనేక సమస్యలుంటే ఒక సినిమా రిలీజ్‌కు .. చీఫ్ సెక్రటరీ నుంచి కలెక్టర్లు, ఆర్డీవోల వరకు మొత్తం యంత్రాంగాన్ని తిప్పగలరు. కానీ ఇళ్ల పట్టాలు, టిడ్కో హౌసింగ్‌ సమస్యలు, మౌలిక వసతుల కల్పనకు వ్యవస్థలు ఎందుకు పనిచేయవు. ఎందుకంటే.. వీటిపై వారికి శ్రద్ధ ఉండదు. ప్రత్యర్థులపై దాడి చేయాలంటే కలెక్టర్‌, చీఫ్‌ సెక్రటరీ అందరూ ముందుకొస్తారు. 5, 10, 15 రూపాయల సినిమాల కోసం వ్యవస్థను మొత్తం నడపగలరు కానీ, సగటు మనిషి సమస్యల పరిష్కారానికి ఎందుకు బయటకు రారు.

పవన్‌కల్యాణ్​

‘‘కొన్ని సంత్సరాలు రోడ్లపై తిరిగిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేస్తాడని అందరూ భావించారు. కానీ, అది భ్రమేనని తేలిపోయింది. అధికారంలోకి రాగానే 30లక్షల మంది భవన కార్మికుల పొట్టకొట్టారు. వందలాది మంది కార్మికులు చనిపోయారు. ఆరోజు నుంచే జనసేన పోరాటం ప్రారంభమైంది. ఇది మూడో ఆదివారం జనవాణి కార్యక్రమం చేపట్టి. అవినీతి, ఇళ్ల పట్టాలు, మౌలిక వసతులు గురించి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. గత ప్రభుత్వం తప్పుచేసింది.. ఇసుక విధానాన్ని మరింత సరళతరం చేస్తామని వైకాపా ప్రభుత్వం చెప్పింది.. కానీ, ఇసుక దోపిడీ పెరిగిపోయిందని ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. లారీ ఇసుక రూ.28వేల నుంచి 36వేల వరకు ధర పలుకుతోంది. ఎస్సీలకు వైకాపా అండగా ఉంటుందనుకున్నారు.. కానీ, ప్రశ్నిస్తే వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. గోపాలపురంలో 25మంది ఎస్సీ యువకులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టారు. డ్వాక్రామహిళలకు జరుగుతున్న అన్యాయాలు. టిడ్కో ఇళ్ల సమస్యలు, భీమవరంలో డంపింగ్‌ యార్డు తదితర సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. వైకాపా పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నారు. అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపానం నిషేధం చేపడతామని చెప్పారు. కానీ, మద్యం ద్వారా రూ.25వేల కోట్లు ఆదాయం పొందుతున్నారు. ఇవాళ ప్రభుత్వమే నేరుగా మద్యం అమ్ముతోంది. మద్యం అమ్మకాల్లో డిజిటల్‌ ట్రాన్సక్షన్స్‌ లేవు. కేవలం నగదు ద్వారానే అమ్మకాలుు చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం తాగి అనధికార గణాంకాల ప్రకారం.. దాదాపు 5వేల మంది చనిపోయారు. 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేవలం 36 ఉద్యోగాలే భర్తీ చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో డయాలసిస్‌ బాధితులకు వైద్యం అందట్లేదు. నూతన ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో రాష్ట్రంలో విద్యావ్యవస్థను వైకాపా దెబ్బతీసింది. ప్రజల్లో మార్పు రావాలి. వైకాపా పాలన అంతమవ్వాలి ’’- పవన్‌ కల్యాణ్

ముద్దుల మావయ్య మాటలు మాత్రం బాగా చెబుతారు...: దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఉన్నా పింఛను ఇవ్వట్లేదు. తూతూ మంత్రంగా కొంతమందికి ఇచ్చి వదిలేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారు. మేం కూడా ఇక్కడ పెరిగిన వాళ్లేమే. మేమేదో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచో, న్యూయార్క్‌.. బాస్టన్‌ లాంటిచోట పెరగలేదు. ఆంధ్రాలోనే పెరిగాం. అన్నొస్తే అద్భుతాలు జరగుతాయన్నారు. కానీ, ఎక్కడా జరగడంలేదు. మద్యపానం నిషేధం అన్నారు ఏదీ? ఎక్కడ? యువత మధ్య వ్యక్తిగతంగా అనేక భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. కానీ, ప్రజా సమస్యలపై అందరూ ఏకమై పోరాడాలి. ఇన్నేళ్లుగా భీమవరం డంపింగ్‌యార్డు సమస్య ఎందుకు పట్టించుకోరు. చేయాలని చిత్తశుద్ధిలేదు వీళ్లకు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చాలా పనులు చేయొచ్చు. తుందూరు ఆక్వా ఫ్యాక్టరీ గురించి ముద్దుల మావయ్య బాగా చెప్పారు. అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పారు. మావయ్యకు జేబులో నుంచి డబ్బులు తీయడం రాదు కానీ, నోట్లో నుంచి మాటలు మాత్రం బాగా వస్తాయి’’ అని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 17, 2022, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.