Pandem kodi Rates: సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మొదటగా గుర్తొచ్చేది కోడి పందేలే. పందెంరాయుళ్ల అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కోళ్లను కొందరు పెంపకందార్లు దాదాపు ఏడాదిన్నరగా సిద్ధం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వి.కె.రాయపురంలో దగ్గుమిల్లి మధు పెంచుతున్న పందెం కోళ్ల ధరలను పరిశీలిస్తే వామ్మో.. అనాల్సిందే..! 20 నెలలు వయసున్న రసంగి పందెం కోడి ధర రూ.2.60 లక్షలు పలుకుతోంది. ఈ రకం పుంజు శరీర తత్వం, పోట్లాడే తీరు మిగితా కోళ్ల కంటే భిన్నంగా ఉంటుందని పలువురు పందెంరాయుళ్ల తెలిపారు. పచ్చకాకి రకం కోడి విలువ రూ.2 లక్షల పైన ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మీకు తెలుసా..? శాస్త్రాలు మనుషులకే కాదు కోళ్లకూ ఉన్నాయి...!