పశ్చిమ గోదావరి జిల్లాలోని 900 పంచాయతీల్లో మహిళలకు 463, జనరల్ కు 437 కేటాయించారు. సామాజిక వర్గాల వారీగా 66 గిరిజన గ్రామాల్లో 34 సర్పంచ్ పదవులను మహిళలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన 195 పంచాయతీల్లో 108 మహిళలకు దక్కాయి. బీసీలకు చెందిన 206 పంచాయతీల్లో 110 మహిళలకు కేటాయించారు. అన్‌రిజర్వ్ కేటగిరికి కేటాయించిన 429 పంచాయతీల్లో 208 పంచాయతీలు మహిళలకు దక్కాయి.
వార్డులకు సైతం రిజర్వేషన్లు ఖరారు
900 పంచాయతీల్లోని 9098 వార్డులకు సైతం రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్టీకి కేటాయించిన 67 వార్డుల్లో 46 వార్డులు మహిళలకు దక్కాయి. ఎస్సీకి కేటాయించిన 2178 వార్డుల్లో 1279 వార్డులను మహిళలకు ఇచ్చారు. బీసీలకు దక్కిన 2120 వార్డులలో 1100 వార్డులను మహిళలకు రిజర్వ్ చేశారు. అన్ రిజర్వుడు కింద ఉన్న 4733 వార్డుల్లో 2124 వార్డులు మహిళలకు అందాయి.
ఇదీ చూడండి: