పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో తొలి విడత జరిగిన సర్పంచి ఎన్నికల లెక్కింపు ప్రక్రియ నేడు ఉదయానికి పూర్తయ్యింది. నియోజకవర్గంలో 45 పంచాయతీల్లో.. 5 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 40 సర్పంచి పదవులకు ఎన్నికలు జరిగాయి. వీటిలో వైకాపా మద్దతుదారులు 23, తెదేపా మద్దతుదారులు 3, జనసేన మద్దతుదారులు 3, జనసేన తెదేపా మద్దతుదారులు 11 మంది గెలుపొందారు.
నరసాపురం మండలంలో 28 గ్రామాలకు.. 5 గ్రామాలు ఏకగ్రీవం కాగా 23 గ్రామాల్లో ఎన్నిక జరిగింది. వీటిలో వైకాపా మద్దతుదారులు 16, తేదేపా మద్దతుదారులు 2, జనసేన మద్దతుదారుడు 1, జనసేన తేదేపా మద్దతుదారులు నలుగురు సర్పంచులుగా గెలుపొందారు. మొగల్తూరు మండలంలో 17 గ్రామాలకు ఎన్నికలు జరగగా.. వైకాపా మద్దతుదారులు ఏడుగురు, తేదేపా మద్దతుదారుడు 1, జనసేన మద్దతుదారులు 2, జనసేన తెదేపా మద్దతుదారులు ఏడుగురు సర్పంచులుగా గెలుపొందారు.
ఇదీ చదవండి: గెలుపొందినా డిక్లరేషన్ ఫారం ఇవ్వలేదంటూ జనసేన కార్యకర్తల ధర్నా