పశ్చిమగోదావరి జిల్లాలో రబీ ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో సొమ్ములు పడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 15 నుంచి జిల్లాలోని 325 కేంద్రాల్లో 13.22 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రక్రియ ప్రారంభమవగా.... ఇప్పటికి 11.05 లక్షల టన్నులు సేకరించారు. అయితే ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటికి నయాపైసా జమకాలేదు. జిల్లా వ్యాప్తంగా రైతులకు 14 వందల కోట్ల మేర బకాయిలు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
పోషణ కష్టమవుతోంది...
అప్పుల వాళ్లు వెంటపడుతున్నారని, కుటుంబ పోషణ కష్టమవుతోందని రైతులు దిగులు చెందుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఖరీఫ్ మొదలవుతున్న పరిస్థితుల్లో... చేతిలో చిల్లిగవ్వ లేకుండా సాగు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. బకాయిలు త్వరగా విడుదలయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి..