ETV Bharat / state

మంత్రి పుష్పశ్రీవాణిపై కుల వివాదం..ఎస్టీ కాదని ఫిర్యాదు - కొండదేవర తెగ

ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి పుష్పశ్రీవాణి కులంపై మరోసారి చర్చ జరుగుతోంది. ఆమె ఎస్టీ కాదని ఆరోపిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. అయితే ఇవి తమకు కొత్తేం కాదని మంత్రి పుష్పశ్రీవాణి అన్నారు.

పుష్పశ్రీవాణి
author img

By

Published : Oct 4, 2019, 4:39 PM IST

మీడియాకు వివరణ ఇస్తున్నఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి

రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిని మరోసారి కుల వివాదం చుట్టుకుంది. ఆమె ఎస్టీ కాదని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేష్, అఖిల భారత దళిత హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మణిసింగ్ పశ్చిమ గోదావరి కలెక్టర్ ముత్యాలరాజుకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెంలో జన్మించిన పుష్పశ్రీవాణి గిరిజనురాలు కాదని వారు ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్​లో తెలిపిన విధంగా మంత్రి కొండదేవర తెగకు చెందిన వారు కాదని రేగు మహేష్, మణిసింగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు జిల్లా పరిశీలన కమిటీ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మంత్రి పుష్పశ్రీవాణి స్పందించారు. "ఎలక్షన్ ఫిటిషన్ వేసినట్లు నాకు తెలిసింది. అయితే ఇంకా నాకు నోటీసు అందలేదు. 2014 ఎన్నికల్లో కూడా ఇదేవిధంగా తెదేపా ఫిర్యాదు చేసింది. అప్పట్లో కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇప్పుడు కూడా ఆ వర్గం వారే పని కట్టుకుని ఫిర్యాదు చేయించారు. అయినప్పటికీ న్యాయం మా వైపు ఉంది. ఈ దఫా కూడా కోర్టులో మేమే గెలుస్తాం" అని మంత్రి పుష్ఫశ్రీవాణి ధీమా వ్యక్తం చేశారు.

Intro:AP_CDP_27_04_VUDYANAM_ADHVANNAM_AP10121

Body:పచ్చదనం ఉట్టి పడుతున్నా కడప జిల్లా బ్రహ్మంగారిమఠం లోని ఉద్యానంలో నిర్వహణ లేక పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయి. హెరిటేజ్ కారిడార్ సర్క్యూట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 168 లక్షల నిధులతో అతిథి భవనం తోపాటు ఉద్యమాన్ని అందంగా తీర్చిదిద్దారు. నిర్వహణ బాధ్యతలను బ్రహ్మంగారిమఠం యాజమాన్యానికి అప్పగించారు. పరిసరాల్లో చెత్త ఉద్యానవనం లోనే పడేస్తున్నారు. పందుల సంచారంతో ఉద్యానంలోకి ప్రవేశించే పర్యాటకులు భయపడిపోతున్నారు. పిచ్చి మొక్కలు పెరిగి ఎక్కడ విషసర్పాలు వస్తాయన్న భయం వెంటాడుతోంది. ఆట పరికరాలు మూలకు చేరడంతో ఉద్యానంలో కి ప్రవేశించే చిన్నారులు వెనుదిరిగే పరిస్థితి నెలకొంది. ఉద్యానం రూపురేఖలు మారకుండా పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Conclusion:BYTE: వెంగళరెడ్డి, స్థానికుడు
Byte: ఈశ్వర్ ఆచారి, బ్రహ్మంగారి మఠం మేనేజర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.