ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలు పరిష్కరించి వారికి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫెడ్ రైతుల కమిటీ ఛైర్మన్ కొటారు రామచంద్రరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. జోనల్ విధానానికి వ్యతిరేకంగా ఆయిల్ ఫామ్ గెలల కొనుగోలు, పలు పరిశ్రమలు రైతులకు రవాణా చార్జీలు చెల్లించకపోవడం వంటి సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఏపీలో ఓఈఆర్, తెలంగాణ ఓఈఆర్కి వ్యత్యాసంపై తక్షణం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవీ చదవండి.. మద్యం దుకాణాలు మూసివేయాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా