రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్న ఉన్న తెల్ల రేషన్ కార్డుల స్థానంలో నూతన కార్డుల పంపిణీకి ప్రభుత్వం నేటి నుంచి శ్రీకారం చుట్టింది. పశ్చిమగోదావరి జిల్లాలో 12, 59, 911 మంది తెల్ల రేషన్ కార్డులు ఉన్నారు. వీరిలో లక్షా 13 వేల మంది నిబంధనలకు విరుద్ధంగా తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నారని ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు. వారి జాబితాలను పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని సచివాలయాల్లో ప్రకటించారు జిల్లాలో అనర్హులుగా ప్రకటించిన లక్షా 13 వేల మందిలో 36 వేల మంది తాము తెల్లరేషన్ కార్డు కలిగి ఉండటానికి అర్హులమని తిరిగి దరఖాస్తు చేసుకున్నారు 51,642 మంది తాము తెల్లరేషన్ కార్డు కలిగి ఉండడానికి అనర్హుల మంటూ స్వచ్ఛందంగా దరఖాస్తు చేశారు. స్వచ్ఛందంగా దరఖాస్తు చేసిన వారిలో కొంత మంది అర్హులైనప్పటికీ అవగాహనా లేమితో దరఖాస్తు చేశారని, అటువంటి దరఖాస్తులను పరిశీలించి బియ్యం కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు అటు వంటి దరఖాస్తులను పరిశీలించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. పరిశీలించే కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీలోగా పూర్తి చేసి అర్హులను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం అనర్హులమని దరఖాస్తు చేసిన వారిలో అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పౌరసరఫరాల శాఖ అధికారులు వివరిస్తున్నారు అనర్హులుగా ప్రకటించిన వారిలో తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే వారికి కొత్త బియ్యం కార్డులను మంజూరు చేస్తామని అన్నారు.
ఇదీ చదవండి :