కొన్ని పార్టీలు 'చలో అమలాపురం' అంటూ పిలుపునిస్తున్నాయని... కొవిడ్ యాక్డ్ ప్రకారం సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు స్పష్టం చేశారు. ఏలూరులోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అంతర్వేది రథం దగ్ధం కేసును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిందని డీఐజీ గుర్తు చేశారు. కొత్త రథం తయారీకి నిధులు విడుదల చేసిందని అన్నారు. ఘటనకు కారణమైన అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆయన... ఈ కేసులో అనుమానితులని విచారిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి