పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సార్వ గ్రామంలో కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. వైకాపా జిల్లా నాయకుడు కౌరు రాంబాబు కొత్త రేషన్‌కార్డులతో పాటు కార్డుదారులకు రేషన్ బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా వైకాపా నేత రాంబాబు మాట్లాడుతూ, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో చిరంజీవి, పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నేతలు