ETV Bharat / state

రాష్ట్రంలో పెద్దఎత్తున సారా తయారీ.. అందుకు సాక్ష్యమిదే! - ఏపీ వార్తలు

జంగారెడ్డిగూడెం ఘటన తర్వాత సెబ్‌ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. 5 రోజులు దాడులు చేసి... 5,76,710 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. రూ 5 రోజుల్లో 1,129 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

natu sara
natu sara
author img

By

Published : Mar 17, 2022, 3:49 AM IST

Updated : Mar 17, 2022, 5:47 AM IST

రాష్ట్రంలో 5 రోజులు దాడులు చేస్తేనే... 5,76,710 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశారంటే.. క్షేత్ర స్థాయిలో సారా తయారీ ఎంత విస్తృతంగా సాగుతుందో అర్థమవుతోంది. అంటే, వినియోగం కూడా అదే స్థాయిలో ఉందనే అర్థం. జంగారెడ్డిగూడెం ఘటన తర్వాత సెబ్‌ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా కేంద్రాలపై జరిపిన దాడుల్లో నమోదు చేసిన కేసుల్లో 40.38%, గుర్తించిన నిందితుల్లో 52.43% మంది, ధ్వంసం చేసిన బెల్లం ఊటల్లో 54.58%, స్వాధీనం చేసుకున్న నాటు సారాలో 50.28% తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి.

రాష్ట్రంలో పెద్దఎత్తున సారా తయారీ.. అందుకు సాక్ష్యమిదే!

పట్టణాల్లోనే తయారు చేయనక్కర్లేదు..

55 వేల జనాభా కలిగిన పట్టణంలో సారా కాయగలరా? అంటూ ఇటీవల శాసనసభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తయారుచేసేది ఎక్కడైనా.. ఆ పట్టణంలో విక్రయాలు జరుగుతున్నాయా? ఎక్కడి నుంచి వస్తోంది? జంగారెడ్డిగూడేనికే కాకుండా ఇతర ప్రాంతాలకూ ఆ సారా తరలుతోందా? వీటిని వ్యవస్థీకృతంగా నడిపిస్తున్న వారి పట్ల సెబ్‌ ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది? అనే అంశాలపై దర్యాప్తు చేసి మూలాలు తేల్చి వాటికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది. కానీ, సీఎం వ్యాఖ్యలతో అసలైన దోషులు తప్పించుకునేందుకు వీలువుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలతో ఆ పట్టణంలోని సారా వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అంటే అంతకు ముందు నుంచే అక్కడ సారా విక్రయాలు జరుగుతున్నట్లే కదా! వాటికి అడ్డుకట్ట వేయలేకపోయినట్టే కదా!

5 రోజుల్లో 1,129 కేసులు..

‘ఈ నెల 10-14 తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా స్థావరాలపై దాడులు చేశాం. మొత్తం 1,129 కేసులు నమోదు చేసి 677 మంది నిందితుల్ని గుర్తించాం. 5,76,710 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశాం. 13,471 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నాం. ఉభయగోదావరి జిల్లాల పరిధిలో 456 కేసులు నమోదు చేసి 355 మంది నిందితుల్ని గుర్తించాం. 3,14,770 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశాం. 6,774 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నాం.’

-సెబ్‌ విడుదల చేసిన గణాంకాలు

రాష్ట్రంలో నాటుసారా తయారీ, వినియోగం గత కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని చోట్లా నిరుపేదలు, రోజు కూలి చేసుకునేవారు, సామాన్యులు నాటు సారా వైపు మళ్లారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక మద్యం ధరలు పెంచేయటంతో.. ఆ అలవాటు ఉన్నవారు మద్యం కొనలేక సారాకు అలవాటుపడ్డారు. ఆ తర్వాత మద్యం ధరల్ని తగ్గించినా వారు నాటు సారా అలవాటునే కొనసాగించారు. దాని వినియోగం పెరగడంతో.. ఇదే అవకాశంగా కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు మారుమూల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సారా తయారు చేయించి... దాన్ని సమీపంలోని పట్టణాలు, పల్లెల్లోకి ప్యాకెట్లలో సరఫరా చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తుండటంతో కొందరు నాయకులు ఈ తయారీ, సరఫరాను వెనుక ఉండి నడిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ దందా అంతా వ్యవస్థీకృతమైపోయింది. ఏయే ప్రాంతాల్లో ఎవెవరు సారా తయారు చేయిస్తున్నారు? వారు ఏ మార్గంలో దాన్ని ఎక్కడెక్కడకు సరఫరా చేస్తున్నారు? విక్రయ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలన్నీ క్షేత్ర స్థాయిలోని పోలీసు, సెబ్‌ సిబ్బందికి తెలిసినా.. వారిలో కొందరు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.

తయారీ, సరఫరా ఇలా..

* కర్నూలు జిల్లాలోని అవుకు, చాగలమర్రి ప్రాంతాల్లో తయారైన సారా అనంతపురం, కడప జిల్లాలకు సరఫరా అవుతోంది. అక్కడి నుంచి పల్లెలకు తరలుతోంది. గడివేముల పరిధిలోని ఎల్‌కే తండా, ఒండుట్ల, పైబోగుల, భోగేశ్వరం సమీపంలోని ఎర్రమల కొండలు, ఓర్వకల్లు పరిధిలోని గుమ్మితం తండా, గుండుంబాయి తదితర ప్రాంతాల్లో తయారీ పెద్ద ఎత్తున సాగుతోంది. నంద్యాల పట్టణంలో కుందూ నది వెంటే సారా బట్టీలు వెలిశాయి.

* శ్రీకాకుళం జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఒడిశాలో తయారవుతున్న నాటు సారాను సముద్ర మార్గంలో ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, గార, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని పలు గ్రామాలకు చేరవేస్తున్నారు. ఇసుక తిన్నెల్లోనూ, మడ అడవుల్లోనూ భద్రపరిచి వీలు చూసుకుని సమీప పట్టణాలు, పల్లెల్లోకి తరలిస్తున్నారు. సీతంపేట మన్యంలోని పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున సారా తయారవుతోంది.

* విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలంలోని తీర గ్రామాలైన రాజయ్యపేట, చినతీనార్ల, బోయపాడు, ఉపమాక, చినదొడ్డిగల్లు, దేవవరం తదితర గ్రామాల్లో సారా తయారీ ఎక్కువగా ఉంది.

* అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, గుత్తి, పామిడి, కదిరి, కల్యాణదుర్గం, బెళుగుప్ప, హిందూపురం తదితర మండలాల పరిధిలో సారా తయారీ స్థావరాలున్నాయి. సంతల్లో ఈ వ్యాపారం సాగుతోంది.

* పశ్చిమగోదావరి జిల్లా మన్యంలోని పలు గ్రామాల నుంచి కొయ్యలగూడెం, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, ఏలూరు, చింతలపూడి, భీమవరం, తణుకు తదితర పట్టణాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరానికి నాటు సారా ప్యాకెట్ల రూపంలో తరలుతోంది.

* చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలం రాసనపల్లె, కట్టకిందపల్లె, పేయనపల్లె, అయ్యవారి కండ్రిగలతో పాటు మదనపల్లె, పుంగనూరు మండలాల్లోని తండాలు, నగరి, పుత్తూరు, కార్వేటినగరంలోని పలు గ్రామాల్లో సారా తయారీ, వినియోగం సాగుతోంది. ఇవి కొన్ని తార్కాణాలు మాత్రమే. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది.

* ప్రధానంగా తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల పరిధిలో నాటుసారా తయారీ, వినియోగం పెద్ద ఎత్తున సాగుతోంది.

2021లో సెబ్‌, పోలీసులకు పట్టుబడ్డ నాటుసారా

స్వాధీనం చేసుకున్న నాటుసారా: 6,84,484

లీటర్లు ధ్వంసం చేసిన బెల్లం ఊటలు: 2,39,45,498 లీటర్లు

....

ఇదీ చదవండి: నాటుసారా, జె బ్రాండ్ మద్యంపై అధ్యయన కమిటీ: చంద్రబాబు

Last Updated : Mar 17, 2022, 5:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.