రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పక్క చూపులు చూడాల్సిన అవసరం లేదని.. పార్టీలో ఎలాంటి కోటరీలు లేవని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శాసన సభ్యుడు ముదునూరి ప్రసాద్ రాజు చెప్పారు. నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
వైకాపా ఎమ్యెల్యేలు, ఎంపీలకు జగన్ మోహన్ రెడ్డి అపాంయిట్మెంట్ దొరకదని రఘురామకృష్ణరాజు చేసిన విమర్శల్లో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. ఆయన మీడియా ముందు అలా మాట్లాడాల్సిన అవసరం లేదని.. ఏదైనా ఉంటే.. సీఎంను వ్యక్తిగతంగా కలసి తెలియజేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి చలువ వల్లే రఘురామకృష్ణంరాజు ఎంపీ కాగలిగారని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
కాళ్లావేళ్లా పడితే వైకాపాలో చేరా.. నాకు నేనుగా వెళ్లలేదు: రఘురామకృష్ణరాజు