పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనసేన పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ అధ్యక్షుడు కొణిదల నాగబాబు పాల్గొన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు ఆక్సిజన్ లాంటి వాళ్లని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు ఘనంగా పనిచేశారని ప్రశంసించారు. ఓటమి ఒక విధంగా మంచిదేనన్న ఆయన.. వచ్చే ఐదేళ్లలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. ప్రతి కార్యకర్త 2024 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతీకార పాలన చేయాలని వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గడిచిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల ఓట్లు వచ్చాయన్న ఆయన 2024 నాటికి 2 కోట్ల ఓట్లు వచ్చేలా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: