సినీ నటుడు రామ్ చరణ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు మృత్యుంజయ హోమం జరిపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాజీ సర్పంచి రాంధే రాజారావు ఆధ్వర్యంలో హోమం జరిగింది. రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన రంగస్థలం చిత్రంలో చిన్న పాత్రలో నటించిన లక్ష్మి.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చరణ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అభిమానులు కాంక్షించారు.
ఇదీ చదవండి: మచిలీపట్నంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్