ప్రభుత్వ ఉద్యోగి గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవేందర్‌రెడ్డిని డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించిందని.. ఆయన పనేదో ఆయన చేసుకోవాలని, తనపై కామెంట్లు చేయడమేంటని ప్రశ్నించారు. ఒక ఎంపీపై ప్రభుత్వ ఉద్యోగి నీఛమైన కామెంట్లు చేస్తుంటే... కనీసం పిలిచి మందలించరా అని నిలదీశారు.
ఈ విషయంపై సీఎం జగన్ స్పందించకుంటే పార్లమెంటులో, లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తానని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. అతన్ని 48 గంటల్లో విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో పేరు ప్రఖ్యాతలున్న ఓ కులాన్ని తిరస్కరించే స్థాయికి దిగజార్చుతున్నారని పేర్కొన్నారు. గతంలో సామాజిక మాధ్యమాల్లో తనపై గుర్రంపాటి చేసిన విమర్శలను రఘురామకృష్ణరాజు గుర్తుచేశారు.
ప్రజల డబ్బుతో పార్టీని నడుపుతున్నారా..? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ప్రజల డబ్బును వెచ్చించి పార్టీ పనులు చేయించుకునే వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నాళ్లు అక్రమాలను సహిస్తూ ఉంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 'రెడ్డీజం' వచ్చిందని... ఇది మంచిది కాదని స్పష్టం చేశారు. ఒక కులానికి, ప్రభుత్వానికి మచ్చ తెచ్చేవారిని సహించవద్దని సీఎం జగన్‌కు సూచించారు.
ఇదీ చదవండి:
అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థపై సీఎం జగన్ సమీక్ష