పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘం పరిధిలో పట్టిన కోతులకు ఎలాంటి నష్టం జరగలేదని.. అటవీశాఖ నల్లజర్ల డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు.
తణుకు పురపాలక సంఘం పరిధిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు.. పురపాలక సంఘ అధికారులు గడిచిన రెండు రోజుల్లో 120 కోతులను పట్టుకున్నారు. ఆ కోతులకు ఎటువంటి ఆహారం ఇవ్వడం లేదని, జంతు సంరక్షకులు.. భాజపా ఎంపీ మేనకా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె కోతుల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుతో మాట్లాడారు. కలెక్టర్ అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో నల్లజర్ల అటవీశాఖ అధికారులు తణుకు వచ్చి పరిశీలించారు. కోతులను స్థానిక వెటర్నరీ వైద్యులతో పరిశీలన చేయించి.. నల్లజర్ల అటవీ ప్రాంతంలో వదిలేశారు. కోతులకు ఎలాంటి అనారోగ్యం కలగలేదని తెలిపారు.
ఇదీ చదవండి: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య