MLA Nimmala Ramanaidu Arrest in Palakollu : 'పాలకొల్లు చూడు' పేరిట నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని.. పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ నిరసనకు అనుమతి లేదన్న పోలీసులు ఇంట్లో నుంచి రామానాయుడు బయటికి రాకుండా భారీగా బలగాలను మోహరించారు. ఈ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యేని గృహనిర్బంధంపై తీవ్రంగా మండిపడ్డారు. తమ నాయకుడి బయటికి పంపాలని పట్టుబడుతూ ఇంటివైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, తెలుగుదేశం కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఇక టిడ్కో గృహ సముదాయం వద్ద ఎవరూ నిరసనకు దిగకుండా ప్రధాన గేటును పోలీసులు మూసివేశారు. ఎమ్మెల్యే పిలుపుతో తరలివస్తున్న టిడ్కో లబ్ధిదారులను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
టిడ్కో ఇళ్లపై జగన్ నిర్లక్ష్యం - లబ్దిదారులకు శాపంగా మారిన ప్రభుత్వ అలసత్వం
TIDCO Houses Issue in West Godawari : ఇంటిచుట్టూ మోహరించిన పోలీసుల కళ్లుగప్పి కొద్దిసేపటి తర్వాత బయటికొచ్చిన ఎమ్మెల్యే రామానాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాలు చేతబట్టుకుని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆయన వెంటబడిన పోలీసులు అంబేడ్కర్ విగ్రహం వద్ద అరెస్టుకు యత్నించారు. మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటిస్తుంటే అడ్డంకులేంటని రామానాయుడు ఆగ్రహించారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే అరెస్టుకు పోలీసులు ప్రయత్నించగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలోనే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో నిమ్మల రామానాయుడు కిందపడిపోయారు. కొద్దిసేపటి తర్వాత తెలుగుదేశం నాయకులను పక్కకు లాగిపడేసిన పోలీసులు ఎమ్మెల్యేని బలవంతంగా వాహనం ఎక్కించారు. పోలీసు వాహనం ముందుకు కదలకుండా మరోసారి తీవ్రంగా ప్రతిఘటించిన తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డుపై అడ్డంగా బైఠాయించారు. కార్యకర్తలను పక్కకు తోసేసిన పోలీసులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని భీమవరం వైపుగా తరలించారు. అయితే ఎమ్మెల్యేని స్టేషన్ కు తీసుకెళ్లకుండా పోలీసు వాహనంలోనే తిప్పుతున్నారు.
జగనన్నా రెండో ఉగాది పోయింది.. ఇళ్లు ఎక్కడ..?
"పేదలకు గత ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తే పంపిణీ చేయకుండా ఆపడం సరికాదు. టిడ్కో ఇళ్లలో టీడీపీ వారు కట్టిన ఒక వాటర్ ట్యాంక్ తప్ప మరో నిర్మాణం జరిగిందా? ఒక అరబస్తా సిమెంట్, ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు చెయ్యలేదు. నాలుగున్నర సంవత్సరాలుగా ఈ పేద వారికి ఇళ్లు ఎందుకు ఇవ్వలేదో సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. వాళ్ల అద్దె బాధలు ఎవరు తీరుస్తారు? ఈరోజు జరిగేది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం." - టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
నత్తనడకన టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ
YCP, TDP Fires on TIDCO Issue : అంతకుముందు నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటూ ఎమ్మెల్యే నిమ్మలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ విషయం తెలుసుకుని ఎమ్మల్యే ఇంటి వద్దకు భారీగా చేరుకున్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.. నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇక తెలుగుదేశానికి పోటీగా "వాస్తవాలు చెబుతాం" అంటూ వైసీపీ నాయకులు తలపెట్టిన కార్యక్రమాన్నీ పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ కార్యాలయం వద్దే ఆ పార్టీ నాయకులను ఆపేశారు.
టిడ్కో గృహాలపై గూడుకట్టిన నిర్లక్ష్యం.. సర్కార్‌పై లబ్ధిదారుల విమర్శలు