పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణ పరిధిలో రహదారులు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విన్నవించారు. నవరత్నాల అమల్లో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన మంత్రికి ఎమ్మెల్యే వినతి పత్రం సమర్పించారు. పట్టణంలో రహదారులు, కొత్తగా నిర్మిస్తున్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. పట్టణ పరిధిలో ఉన్న అతిథి గృహం శిధిలావస్థలో ఉన్నందున.. కొత్త భవనాలు నిర్మించడానికి నిధులు ఇవ్వాలని కోరారు.
వినతి పత్రంపై మంత్రి స్పందన..
వినతిపత్రంలో సమర్పించిన అంశాలపై స్పందించిన మంత్రి.. ప్రజలకు అవసరమైన రహదారులు నిర్మాణంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అతిథి గృహానికి నిధులు విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి...