గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ వద్దనున్న బాలికల బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల ఈ పాఠశాలలో కలుషిత ఆహారం తిని సుమారు 20 నుంచి 30 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతోనే ఆకస్మిక తనిఖీలు చేయాల్సి వచ్చిందన్నారు. విద్యార్థినులు గురుకుల పాఠశాలలో ఎదుర్కొంటున్న పలు సమస్యలపై.... తనకు ఫిర్యాదు చేశారని చెప్పారు.
పాఠశాలలో వసతులు, విద్య, మంచినీరు, భోజనం వంటి విషయాల్లో... సమస్యలను చూశామని.. వీటి ద్వారా బాలికలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విద్యార్థినులతో కలిసి కలసి ఎమ్మెల్యే భోజనం చేశారు. నాణ్యత సరిగా లేదని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీ పిల్లలకు ఇలాంటి ఆహారమే పెడతారా?' అని ప్రశ్నించారు. పాఠశాలకు ఆర్వో ప్లాంటును ఏర్పాటు చేస్తామని, ఇతర సమస్యలనూ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: