పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలో.. రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద సొంత ప్రాంతాలకు తరలి వెళ్తున్న వలస కూలీలను పోలీసులు తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేసుకున్న తర్వాతే విడిచి పెట్టారు. మినీ వ్యాన్లు, బస్సులో వెళ్తున్న కూలీలను మొదటగా తెలంగాణ సరిహద్దు వద్ద తనిఖీ చేశారు.
ఎక్కువ వాహనాలను ఒకేసారి అనుమతించిన కారణంగా... ఒక్కసారి వేలాది మంది తరలివచ్చారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. జీలుగుమిల్లి ఎస్సై విశ్వనాథ బాబు త్వరితగతిన కూలీల వివరాలు నమోదు చేస్తూ.. వాహనాలను ముందుకు అనుమతించారు.
ఇదీ చదవండి: