ETV Bharat / state

మడఅడవులు కాపాడుకోకుంటే...పెనుముప్పే - mangroves new story

భీకర తుపాన్లను మడఅడవులు నియంత్రిస్తాయి. వేగంగా వీచే గాలుల నుంచి మానవళిని రక్షిస్తున్నాయి. అలాంటి మడఅడవులు అంతరిస్తున్నాయి. మానవ స్వార్థప్రయోజనాలకు తీరంలో మడ అభయారణ్యం.. కోతకు గురవుతోంది. అభయారణ్యం కనుమరుగుతో.. జీవవైవిధ్యం దెబ్బతింటోంది. తీరప్రాంతంపై సముద్రం విరుచుకుపడుతోంది. మడఅడవులను కాపాడుకోకుంటే.. రాష్ట్ర తీరప్రాంతానికి పెనుముప్పు పొంచి ఉన్న తీరుపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

mangroves-story
mangroves-story
author img

By

Published : Dec 19, 2019, 11:02 AM IST

గోదావరి, కృష్ణా నదుల ముఖద్వారాల వద్ద మడఅడవులు విస్తరించాయి. తీరప్రాంతంలో జీవవైవిధ్యాన్ని కాపాడడానికి సహజసిద్ధంగా తయారయ్యాయి ఈ మడఅడవులు. తీరప్రాంతానికి రక్షణతోపాటు.. పక్షులు, సముద్ర జీవులకు సురక్షిత ప్రాంతాలుగా మారాయి. భారీ వృక్ష సంపదతో ఉండే ఈ అభయారణ్యం అనేక తుపాన్ల నుంచి తీరప్రాంతాన్ని కాపాడింది. కాకినాడ తీరంపై పెథాయ్ తుపాను విరుచుకుపడిన సమయంలో గాలి వేగాన్ని తగ్గించి.. ఎక్కువ నష్టం జరగకుండా మడఅడవులు నియంత్రించాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో రుజువైంది.

కవచకుండలాలు
కాకినాడ సమీపంలోని కోరంగి అభయారణ్యం మడఅడవులకు పెట్టింది పేరు. వందల చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఈ అడవులు మిగతా వృక్షాల కంటే భిన్నమైనవి. తీరాన్ని రక్షించే కవచ కుండలాలుగా ఇవి పనిచేస్తాయి. నిరంతరం సముద్రంపై నిఘావేసి విరుచుకుపడే అలలను కాచుకుంటాయి. వందల సంఖ్యలో మొలస్కా, చేపలు, రొయ్యలు, తాబేళ్ల సంతానోత్పత్తికి తోడ్పాటునందిస్తాయి. వీటి వేర్లు బలంగా మట్టిలో పాతుకుపోవడం వల్ల.. తీరం కోతకు గురికాకుండా ఉంటుంది.

మానవ తప్పిదాలే కారణం

గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో అధికంగా మడ అడవులు విస్తరించి ఉన్నాయి. కాలక్రమంలో వీటి విస్తీర్ణం తగ్గుతోంది. తీరంలో ఆక్వా విప్లవం తర్వాత ఇది మరింత పెరిగింది. గతంలో వంటచెరకు, నివాస ప్రాంతాలు, నాటుసారా కాల్చడం కోసం మడ అడవులను నరికేవారు. ప్రస్తుతం వీటిని నరికేసి రొయ్యలు, చేపల చెరువులుగా మారుస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తీరప్రాంతమే ఇందుకు ఉదాహరణ. జిల్లాలోని నరసాపురం ప్రాంతంలో ఒకప్పుడు దట్టంగా ఉన్న మడ అభయారణ్యం.. ఇప్పుడు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అసలు వీటి జాడే కనిపించడంలేదు.

ఉపాధికి గండి

నరసాపురం తీరప్రాంతం ఏటా సముద్రంలో కలసిపోతోంది. ఉళ్లకు ఊళ్లను సముద్రం మింగేస్తోంది. ఇక్కడ మడఅడవులు అంతరించడం వల్ల మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. చేపల సంతతి తగ్గుతోంది. నరసాపురం తీరప్రాంతంలో 35 దాకా మత్స్యకార గ్రామాలున్నాయి. వీరంతా చేపలవేటపై ఆధారపడి జీవనం సాగించేవారే. ప్రస్తుతం చాలామంది ఉపాధి కోల్పోయి ఇతర వృత్తులకు వెళుతున్నారు. అడవులు అంతరించడం వల్ల రొయ్యల రాక తగ్గిపోయింది. తీరంలో రొయ్యల సాగు పెరగడానికి మడ అడవులే ప్రధాన కారణం.

రక్షణ ఏర్పాట్లు ఏవీ!
35 రకాలు ఉన్న మడ వృక్షజాతులు అనేకం తీరాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండేవి. కాకినాడ తీరం వెంబడి ఉన్న కోరంగి మడఅడవులను అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ అడవుల్లో వాటి వృద్ధికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాటిని నాశనం చేయకుండా రక్షిస్తున్నారు. నరసాపురం తీరం రక్షణను మాత్రం అధికారులు పట్టించుకోలేదు. ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడం వల్ల నరసాపురం తీరంలో మడఅడవులు అంతరిస్తున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి.. నరసాపురం పరిసర ప్రాంతాల్లో అంతరిస్తున్న మడ అడవులను సంరక్షించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

మడఅడవులు కాపాడకుంటే...పెనుముప్పే

ఇవీ చదవండి:

అమరావతి కోసం పోరు సాగిస్తాం: రైతులు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.