ETV Bharat / state

'సారా మత్తులో.. గర్భిణి అని చూడకుండా భార్యను హత్య చేశాడు' - టీ. నరసాపురంలో హత్య కేసులు

పశ్చిమ గోదావరి జిల్లా మక్కినవారి గూడెం గ్రామంలో ఓ గర్భిణి దారుణ హత్యకు గురైంది. ఆమెను భర్తే సారా మత్తులో చంపేశాడని కుటుంబీకులు చెబుతుండగా.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

man killed wife at t. narsapuram
మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త
author img

By

Published : Jun 15, 2020, 4:22 PM IST

6 నెలల గర్భిణి.. అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. భర్తతో కలిసి వెళ్లి.. ఇంటికి తిరుగు వస్తున్న క్రమంలో.. ఆమె చనిపోయింది. సారా మత్తులో భర్తే.. ఆమెను హత్య చేశాడని.. చిన్న గొడవకే.. ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో ఈ విషాదం జరిగింది.

మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. 17 ఏళ్ల క్రితమే బత్తుల వెంకన్న, లక్ష్మికి వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. ప్రస్తుతం లక్ష్మి గర్భవతి. శనివారం చిన్న కుమారుడిని తీసుకుని జీడి పిక్కలు ఏరుకునేందుకు రుద్రకోట రాజుగూడెం ప్రాంతానికి వెళ్లిన ఆ దంపతులు.. ఆదివారం సాయంత్రం తిరుగు ప్రయాణంలో గొడవపడ్డారు. అప్పటికే సారా మత్తులో ఉన్న వెంకన్న.. గుర్తు తెలియని ఆయుధంతో లక్ష్మిపై దాడి చేశాడు. తల, మొహంపై గాయాలతో.. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. రాత్రంతా మత్తులో.. అక్కడే నిద్రించిన వెంకన్న.. ఉదయం కుమారుడిని తీసుకుని.. జీడిపిక్కలు అమ్ముకుని ఇంటికి చేరాడు.

లక్ష్మి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. వెంకన్నను తాళ్లతో కట్టి.. పోలీసులకు అప్పగించారు. అందరు చెప్పిన వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు... 24 గంటల్లో 304 నమోదు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.