ETV Bharat / state

సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడిపై తేనెటీగల దాడి

నిన్న రాత్రి నుంచి సెల్ టవర్‌పై ఓ యువకుడు హల్​చల్ చేశాడు. ప్రేమించిన అమ్మాయి వస్తేనే దిగుతానంటూ ఆందోళన చేశాడు. తేనెటీగలు దాడి చేయడంతో రోహిత్‌కు గాయాలు అయ్యాయి. వెంటనే పోలీసులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఉన్న పోలీసులు, మీడియా సిబ్బందిపైనా తేనెటీగలు దాడి చేశాయి.

man-blackmail-to-jump-from
man-blackmail-to-jump-from
author img

By

Published : Oct 7, 2020, 8:10 AM IST

Updated : Oct 7, 2020, 11:24 AM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్న రోహిత్​పై తేనెటీగలు దాడి చేశాయి. సెల్ టవర్ నుంచి కిందకు దిగే క్రమంలో రోహిత్ కిందకు జారిపోయాడు. పోలీసులు కిందకు దిగమనడంతో టవర్​కి ఉన్న తేనెపట్టుపై రోహిత్ అడుగువేశాడు. దీనితో తేనెటీగలు చెలరేగి రోహిత్​పై దాడి చెయ్యగా.. పక్కనే ఉన్న కల్యాణ మండపంలోకి దూకినట్లు ఇంఛార్జి సీఐ మల్లేశ్వరావు తెలిపారు.

ప్రియురాలి కోసం సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడిపై తేనెటీగలు దాడి

సోమవారం రాత్రి ఓ యువతిని రోహిత్ వేధిస్తున్నాడని వచ్చిన సమాచారం మేరకు కానిస్టేబుల్ రాంబాబు సంఘటనా స్థలానికి వెళ్ళాడు. కానిస్టేబుల్ వీడియో తీస్తుండగా కానిస్టేబుల్​ని రోహిత్ కొట్టడంతో యువకుడిపై జంగారెడ్డిగూడెం స్టేషన్​లో కేసు నమోదైంది. ఈ విషయంపై నిన్న రాత్రి రోహిత్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. తనకు న్యాయం జరగకపోతే పైనుంచి దూకేస్తానంటూ బెదిరించాడు.. శ్రీనివాసపురానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు ప్రోద్బలంతో తనని, తన కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ రోహిత్ ఆరోపించాడు. తాను ప్రేమించిన యువతి, నాయకుడు వచ్చేంతవరకు కిందకి దిగనని చెప్పాడు. పోలీసులు సెల్​టవర్​ దిగాలని చెప్పటంతో రోహిత్​ కిందకు దిగుతున్నప్పుడు తేనెటీగలు దాడి చేశాయి. పోలీసులు, మీడియా సిబ్బందిపై తేనెటీగలు దాడి చేయటంతో పరుగులు తీశారు. రోహిత్ ను ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు

Last Updated : Oct 7, 2020, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.