పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో వాసవి అమ్మవారి మహాకుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. వాడవాడలు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు పూజల్లో పాల్గొన్నారు. రాజగోపుర విమాన స్థూపిక కలశములకు వేదమంత్రాల నడుమ మంత్రులు మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా మహా పూర్ణాహుతి, శ్రీ చండీహోమం శోభాయమానంగా జరిపించారు. అమ్మవారి వైభవాన్ని తిలకించడానికి భక్తులు పోటెత్తారు.
ఇవీ చదవండి.. 'దిశ' సాయం: 8 నిమిషాల్లో మహిళను కాపాడిన పోలీసులు