పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ లారీ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడేనికి చెందిన దాసరి ఎలమంద ఆర్అండ్ఆర్ పనుల్లో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా తోటి డ్రైవర్లు, క్లీనర్లతో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తులో లారీపై నుంచి పడి చనిపోయినట్లు అక్కడ ఉన్నవారు చెప్పారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..