పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ప్రాంతానికి చెందిన సుమారు 45 మంది భక్తులు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరారు. పిప్పర శివారులో... రహదారి పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న వీరి మీదకు లారీ దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. అంబులెన్స్ ఎంతకూ రాని కారణంగా.. క్షతగాత్రులను బొలేరో వాహనంలో తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించే ప్రయత్నంచేశారు. ఈ క్రమంలో ఆసుపత్రికి చేరేలోపే దుర్గ (45) అనే మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని భక్తులు రహదారిపై నిలిపి ఆందోళన చేశారు.
ఇదీ చదవండి: