కరోనా వైరస్ విజృంభణతో పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం అధికారులు లాక్డౌన్ విధించారు. తణకు, అత్తిలి, ఇరగవరం, ఉండ్రాజవరంలో అధికారులు అప్రమత్తమయ్యారు. బంద్ కారణంగా మండల గ్రామాల్లోని ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా మారాయి. పాల కేంద్రాలు, ఔషద దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు. వైద్య అవసరాల కోసం వచ్చే వారిని మాత్రం పట్టణంలోకి అనుమతించారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన గ్రామాల్లో అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కేసు నమోదైన ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించి దిగ్బంధం చేశారు. ఈ ప్రాంతాల్లో ఎవరూ బయటికి రాకుండా సిబ్బందితో కాపలా ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి :