గోదావరి వరదతో లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వశిష్ట గోదావరి పోటెత్తడంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఎనిమిది లంక గ్రామాల్లోకి వరద ప్రవేశించింది. యలమంచిలి, ఆచంట మండలాల్లో లంక గ్రామాలు వరద తాకిడితో వణికిపోతున్నాయి.
యలమంచిలి మండలం దొడ్డిపట్ల, యలమంచిలి లంక, బూరుగుపల్లి, లక్ష్మీపాలెం గ్రామాల్లోకి భారీ స్థాయిలో వరద నీరు ప్రవేశించింది. ఇళ్లలోకి సైతం వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఆచంట మండలం అయోధ్యలంక, అనగారి లంక, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి వరద భారీ స్థాయిలో ఉండడంతో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. తమలపాకులు, అరటి, కూరగాయలు, వరి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. లంక గ్రామాల నుంచి ప్రజల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా.. సదుపాయాలు ఉండడం లేదని వరద బాధితులు అంటున్నారు.
ఇదీ చదవండి
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కరోనా ఉద్ధృతి: చంద్రబాబు