పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ భూమిపూజ చేసింది. ప్రాజెక్టు పనులకు అనుమితిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయటం వలన ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారు. స్పిల్వేలో ఉన్న 18వ బ్లాక్ వద్ద జలవనరుల శాఖ అధికారులతో కలిసి పూజలు చేశారు. అనంతరం పనులు ప్రారంభించారు. ఇటీవలె జరిగిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో పోలవరం హెడ్ వర్క్స్ తో పాటు జలవిద్యుత్ కేంద్రం పనుల్ని మేఘా సంస్థ దక్కించుకుంది.
ఇదీ చదవండి :