పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రెడ్డిగూడెం సమీపంలో.. రెండు వర్గాలకు మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు. బాణాలు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. పోలవరం మండలం ఎల్ఎన్డీ పేటకు చెందిన అయ్యప్ప అనే వ్యక్తికి ఎడమచేతి భుజంలో బాణం దిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. క్షతగాత్రులను ఎల్ఎన్డీ పేట, జంగారెడ్డిగూడెం ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
బుట్టాయగూడెం మండలం రెడ్డిగూడెం, పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీపేట మధ్య కొండపోడు భూములకు సంబంధించి మూడేళ్లుగా భూవివాదం కొనసాగుతోంది. భూములు తమ వంటే తమవని ఇరువర్గాల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొవ్వాడమ్మ తల్లి పండుగ కోసం దేవత కొలువైన స్థలాన్ని మహిళలు శుభ్రం చేస్తుండగా.. తమ భూముల్లోకి మీరెందుకు వచ్చారంటూ ప్రత్యర్థులు ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య మొదలైన వివాదం కొట్లాటకు దారితీసింది.
ఇదీ చదవండి: