ETV Bharat / state

కుంచించుకుపోతున్న కొల్లేరు... కన్నెత్తి చూడని అధికారులు

ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఉన్న సరస్సుల్లో ఒకటైన కొల్లేరు సరస్సు మెలమెల్లగా కనుమరుగవుతోంది. కాపాడుకోవడానికి అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ అవి విఫలమవుతున్నాయి. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పట్టించుకునే వారు లేక ఒంటరవుతోంది.

కొల్లేరు సరస్సు
author img

By

Published : May 3, 2019, 8:33 AM IST

పర్యాటక ప్రాంతం... ఆక్రమణలకు నిలయం

కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు అభయారణ్యం అక్రమాలపాలవుతోంది. ఏటికేడు దురాక్రమణలతో కనుమరుగుదశకు చేరుకొంది. కొల్లేరు సరస్సు పరిరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినా... ఆ అధికారులు చర్యలు గాలికొదిలేసి చోద్యం చూస్తున్నారు. కొల్లేరు వెళ్లే అన్ని రహదారుల్లోనూ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి... ఆక్రమణలు, కాలుష్యాన్ని నియంత్రించాలి. జరుగుతున్న తంతుమాత్రం వేరుగా ఉంది.. తనిఖీలు నామమాత్రమయ్యాయి. లక్షల ఎకరాల కొల్లేరు నేడు అధికారికంగా 76వేల ఎకరాల్లో విస్తరించింది. ఇందులోను అక్రమంగా చేపలు, రొయ్యల చెరువులు తవ్వతుండటం వల్ల.. భవిష్యత్తులో కొల్లేరు ఉనికే ప్రశ్నార్థకంకానుందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం లో పోనీ తుఫాను ప్రభావం కనిపించింది గురువారం ఉదయం నుంచి ఈదురు గాలులు భారీ వర్షాలు పడుతుంది రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తోంది తాసిల్దార్ కార్యాలయంలో లో సెట్ కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులకు రెవెన్యూ అధికారుల సమాచారం అందిస్తున్నారు పాతపట్నం మండల కేంద్రంలో పునరావాస కేంద్రాల్లో భోజనాలను వంటలు చేస్తున్నారు వరద బాధిత గ్రామాల ప్రజలను భోజనాలు అందించనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు

Body:ప

Conclusion:ఫ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.