ETV Bharat / state

విశాఖలో కొత్త రాజధాని ఏర్పాటు అసాధ్యం: ఎంపీ రఘురామ - MP Raghurama comments on Modi

ప్రధానిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు వివరించానని ఎంపీ రఘురామ తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. అమరావతిపై ప్రధాని చాలా సానుకూలంగా కనిపించారని వివరించారు.

విశాఖలో కొత్త రాజధాని ఏర్పాటు అసాధ్యం: ఎంపీ రఘురామ

author img

By

Published : Feb 13, 2021, 4:23 PM IST

Updated : Feb 13, 2021, 5:48 PM IST

విశాఖలో కొత్త రాజధాని ఏర్పాటు అసాధ్యం: ఎంపీ రఘురామ

విశాఖలో కొత్త రాజధాని ఏర్పాటు అసాధ్యమని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. అమరావతిపై ప్రధాని చాలా సానుకూలంగా కనిపించారని వివరించారు. ప్రధానిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు వివరించానని ఎంపీ రఘురామ తెలిపారు. ఆలయాలపై దాడులు, అమరావతి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించానన్న రఘురామ.. అమరావతిలో ఇప్పటికే వేల కోట్లతో భవనాలు నిర్మించారని చెప్పినట్టు తెలిపారు.

విశాఖ ఉక్కు కర్మాగారం అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు ఎంపీ రఘురామకృష్ణరాజు వివరించారు. అన్ని అంశాలు పరిగణించాకే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. మత మార్పిడులపై 25 పేజీల నోట్ ప్రధానికి ఇచ్చానన్న ఎంపీ రఘురామ.. మత మార్పిడులపై కేంద్రం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నట్టు తెలిపారు. చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ టెండర్లపై ప్రధానికి వివరించానని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. ప్రభుత్వమెలా టెండర్లు పిలుస్తుందని ప్రధాని ఆశ్చర్యపోయారని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... మంత్రి కొడాలి నానిపై కేసు నమోదుకు ఎస్‌ఈసీ ఆదేశం

Last Updated : Feb 13, 2021, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.