![నీట మునిగిన పంట](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpg-12-17-input-subsidy-manjooru-av-ap10092_17112020074959_1711f_00054_274.jpg)
పశ్చిమగోదావరి జిల్లాలో ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలకు రైతులు నాలుగు పర్యాయాలు పంటలు నష్టపోయారు. జూలై నెల నుంచి సెప్టెంబర్ వరకు కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసింది. తాజాగా అక్టోబర్లో కురిసిన వర్షాలకు జిల్లాలో ఎన్నో హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లింది. పంటలు నష్టపోయిన 45,331 మంది రైతులకు ప్రభుత్వం 31.79 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని జిల్లా అధికారులు తెలిపారు.
మంజూరైన ఇన్పుట్ సబ్సిడీ నగదును అర్హులైన రైతుల ఖాతాల్లో త్వరలోనే ప్రభుత్వం జమ చేస్తుందని అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు