స్థానిక మత్స్య ఉత్పత్తులకు అధిక ఆదాయం సమకూర్చేందుకు ఫిషింగ్ హార్బర్ దోహదపడుతుందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వల్లవణ్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని బియ్యపు తిప్ప, చినమైనవాని లంక ప్రాంతాల్లో ఆక్వా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఆయన స్థలాన్ని పరిశీలించారు. ఏపీ మారీటైం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హార్బర్ నిర్మించనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాంతంలో వంతెన, అనుబంధ రోడ్డు నిర్మాణాల ద్వారా.. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని వల్లవణ్ అభిప్రాయపడ్డారు. మత్స్యకారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని హార్బర్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. వారి జీవనోపాధిని పెంచడానికి ఉపయోగపడుతుందని వివరించారు.
ఇదీ చదవండి: