అధికార వికేంద్రీకరణకు మద్ధతుగా వైకాపా ప్రవాసాంధ్ర విభాగం సభ్యులు నాగార్జునరెడ్డి, జగదీష్‌రెడ్డిలతో కలిసి రత్నాకర్ 13 జిల్లాల పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు వెళ్లారు. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రప్రజల అవసరాలను తీర్చడంలో సీఎం ముందున్నారన్నారు. ప్రతిపక్షనాయకులు విశాఖపట్నం రాజధానిగా చేస్తే ....దూరమవుతుందని చెప్తున్నారని మండిపడ్డారు. గతంలో హైదరాబాద్ విశాఖపట్టణానికి దూరంగా లేదా? అని ప్రశ్నించారు. అమరావతి భూములను రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి అనువుగా చేసుకున్నారన్నారని ధ్వజమెత్తారు. మూడు రాజధానులకు ప్రజలందరూ మద్ధతివ్వాలని రత్నాకర్ కోరారు.
గతంలో హైదరాబాద్ విశాఖకు దూరంగా లేదా..? - తణుకులో వైకాపా ప్రవాసాంధ్ర ప్రత్యేక ప్రతినిధి
అధికార వికేంద్రీకరణతో రాష్ట్రంలో సమాన అభివృద్ధి జరుగుతుందని వైకాపా ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ అన్నారు. వికేంద్రీకరణకు మద్ధతుగా పార్టీ ప్రవాసాంధ్ర ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ జిల్లాల పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు వెళ్లారు.
![గతంలో హైదరాబాద్ విశాఖకు దూరంగా లేదా..? In support of decentralization, party special spokesperson Ratnakar visited Tanuku](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6090209-95-6090209-1581835187705.jpg?imwidth=3840)
అధికార వికేంద్రీకరణకు మద్ధతుగా వైకాపా ప్రవాసాంధ్ర విభాగం సభ్యులు నాగార్జునరెడ్డి, జగదీష్‌రెడ్డిలతో కలిసి రత్నాకర్ 13 జిల్లాల పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు వెళ్లారు. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రప్రజల అవసరాలను తీర్చడంలో సీఎం ముందున్నారన్నారు. ప్రతిపక్షనాయకులు విశాఖపట్నం రాజధానిగా చేస్తే ....దూరమవుతుందని చెప్తున్నారని మండిపడ్డారు. గతంలో హైదరాబాద్ విశాఖపట్టణానికి దూరంగా లేదా? అని ప్రశ్నించారు. అమరావతి భూములను రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి అనువుగా చేసుకున్నారన్నారని ధ్వజమెత్తారు. మూడు రాజధానులకు ప్రజలందరూ మద్ధతివ్వాలని రత్నాకర్ కోరారు.
ఇదీచూడండి.నూతన రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు
TAGGED:
support of decentralization