ETV Bharat / state

నివర్ తుపాన్ ప్రభావంతో వరి పంటకు నష్టం

నివర్ తుపాన్ అన్నదాతలను నట్టేట ముంచింది. బతుకు జీవనాన్ని అతలాకుతలం చేసింది. నివర్ ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో వరి పంటకు భారీ నష్టం వాటిల్లింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో గతంలో నాలుగు సార్లు పంట నష్టపోయిన రైతులు మాసూళ్లు పూర్తవుతున్న దశలో సైతం నివర్ తుపాన్​ ఎఫెక్టుతో తీవ్ర నష్టంపోయారు. పంటను కాపాడుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు.

నివర్ తుపాన్ ప్రభావంతో వరి పంట నష్టం
నివర్ తుపాన్ ప్రభావంతో వరి పంట నష్టం
author img

By

Published : Nov 29, 2020, 4:48 PM IST

నివర్ తుఫాన్ ప్రభావం వరి పంట నష్టం
నివర్ తుఫాన్ ప్రభావం వరి పంట నష్టం
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 5 లక్షల 55 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. స్వర్ణ, పీఎల్ రకాలను వేశారు. ఇప్పటివరకు రెండు లక్షల 45 వేల ఎకరాలలో పంట మాసూళ్లు పూర్తికాగా మిగిలిన పంట వివిధ దశల్లో ఉంది. ఉండ్రాజవరం పరిసర ప్రాంతాలలో రైతులు ధాన్యం వసూలుచేసి రాశులు పోశారు. నివర్ ప్రభావంతో రాశులు తడిసిపోయి నష్టం వాటిల్లింది. రాసుల కింద నీరు చేరడంతో ధాన్యం మొలకలెత్తింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్​లోనే నాలుగు సార్లు అధిక వర్షాలు కురిసిన పీఎల్ పండించే రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతూ వచ్చారు. కానీ నివర్ తుపాన్ ప్రభావంతో పీఎల్ రకం పంట నేల వాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 30 వేల రూపాయలు పైగా పెట్టుబడి పెట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నివర్ తుఫాన్ ప్రభావం వరి పంట నష్టం
నివర్ తుఫాన్ ప్రభావం వరి పంట నష్టం

ఆర్థికభారం తప్పటం లేదని ఆవేదన

వర్షాలతో ఖాళీ పంటపొలాలు బురదమయంగా మారాయి. దీంతో మిషన్​పై పంట మాసూలు చేయడానికి రెండు గంటల పైగా సమయం కావటం రైతులకు ఆర్థికంగా భారం అవుతుంది. ఎకరానికి సుమారుగా ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసే వారు లేక తక్కువ ధరకు కోళ్ల ఫారాల కు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు

ఇవీ చదవండి

6 సార్లు ప్లాస్మా దానం...పది మందికి ఆదర్శం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.