పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం గూటాల ఇసుక రాంపు నుంచి... అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. ఒకే డీడీతో రెండు లారీలు రావడం గుర్తించిన పోలీసులు వాహనాన్ని నిలుపుదల చేసి అనుమతి పత్రాలు తనిఖీ చేశారు. కొంత కాలంగా పోలవరం, గూటాల, తాడిపూడి, తాళ్లపూడి, వేగేశ్వరపురం, చిడిపి, కొవ్వూరు, ర్యాంపుల నుంచి అక్రమంగా టన్నుల కొద్దీ ఇసుకను తరలిస్తున్నారు. పట్టుకున్న లారీలను పోలీసులు సీజ్ చేశారు.
ఇదీ చదవండి :