ప్రముఖ పుణ్యక్షేత్రమైన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్. జయసూర్య, జస్టిస్ కే. సురేష్ రెడ్డి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖ మండపంలో న్యాయమూర్తులకు... అర్చకులు, పండితులు శ్రీవారి శేష వస్త్రాలతో సత్కరించి, స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు.
ఇదీచదవండి.
రామతీర్థం ఘటనపై వారికి నార్కో పరీక్షలు చేయాలి: మంత్రి కొడాలి నాని