అడుగు తీసి అడుగు పెట్టేందుకు వీలు లేనంతగా వర్షం నీరు చుట్టుముట్టిన కారణంగా.. ఉద్యోగులు తెగ ఇబ్బంది పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇంతగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, జిల్లా ఉప విద్యాశాఖాధికారి కార్యాలయాలు చెరువులను తలపించాయి.
ఈ రెండు కార్యాలయాలకు సంబంధించిన వరండాలో అడుగు మేర నీరు నిలిచిపోయింది. ఉద్యోగులు తమ ద్విచక్ర వాహనాలు సైతం కార్యాలయానికి దూరంగా పార్కింగ్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందితో పాటు.. స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: