పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలకు కాలువలకు గండి పడుతున్నాయి. పెనుమంట్ర మండలంలోని గోస్తాని కాలువకు గండి పడిన కారణంగా.. వందల ఎకరాల పొలాలు నీట మునిగాయి. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వరద నీరు భారీగా చేరగా.. కాలువ గట్లు తెగిపోయాయి.
కాలువలోని నీరంతా సమీపంలోని పొలాల్లోకి చేరింది. సుమారు 12వందల ఎకరాల నారుమడులు, ఉద్యానపంటలు నీటమునిగాయి. సోమరాజు ఇల్లింద్రపర్రు గ్రామంలోకి నీరు చేరగా.. వీధులన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరగా.. గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చదవండి: