పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి లింగపాలెం కామవరపుకోట, టీ నరసాపురం మండలాల్లో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి వరి పంటలు నీట మునిగాయి. మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతినగా... వేరుశనగ పంటకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా చింతలపూడి పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో రహదారులు, నివాస ప్రాంతాల్లో వరద నీరు చేరింది.
ఇదీ చదవండి