ధవళేశ్వరం వద్ద భారీగా వస్తున్న వరద నీటిని క్రిందకు వదలడంతో గోదావరి పాయ అయిన వశిష్టా గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద సముద్రంలో పరుగులు పెడుతోంది. మరోవైపు వరద నీటితో వశిష్టా గోదావరి పొంగిపొర్లడంతో నరసాపురం వెంబడి ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పొలాల్లోకి వరద నీరు చేరి మునిగిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం చేకూరింది. గోదావరి వరదలతో పడవలు గట్టుకే పరిమితమయ్యాయి. వరద ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో ఉండటంతో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి
న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు: ఎంపీ రఘురామకృష్ణరాజు