ఆనందయ్య వైద్యంపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. చికిత్సకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 30 పడకలతో కొవిడ్ బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆనందయ్య తయారు చేసిన ఔషధంలో హానికారక పదార్థాలు లేవని.. ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తెలిపారు. ఆనందయ్యకు భద్రత కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకలు ఏర్పాటు చేసి.. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కుడా అందుబాటులో ఉంచుతామని మంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ రోగులకు పడకలు కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర వ్యాప్తంగా.. నేటి నుంచి 3 రోజులపాటు కరోనా వ్యాక్సినేషన్