పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం గామాన్ వంతెన సమీపంలో బియ్యం బస్తాల మధ్య అక్రమంగా తరలిస్తున్న గుట్కా, కైని బస్తాలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ 2.50 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. జిల్లా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న లారీలో గుట్కా ప్యాకెట్లు రవాణా చేస్తున్నారన్న సమాచారంతో వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. బియ్యం లారీలో కైని, గుట్కా బస్తాలను అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. లారీతో పాటు బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఇది చదవండి వైకాపా ఏడాది పాలనపై 'మన పాలన- మీ సూచన'