ETV Bharat / state

ఇంటిబాట పట్టిన వందలాది మంది విద్యార్థులు.. ఆరా తీసిన పోలీసులు ఏం చేశారంటే..?

ఉపాధ్యాయుల వేధింపులు తట్టుకోలేక విద్యార్థులు చదువు మానేయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం స్వస్థలాలకు బయలుదేరారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వంద మంది విద్యార్థులను ఒక్కసారిగా బస్టాండ్​లో చూసిన పోలీసులు.. విషయాన్ని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో జరిగింది.

Gurukula Students
Gurukula Students
author img

By

Published : Mar 25, 2022, 10:43 PM IST

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు పిల్లలపై వేధింపులు దిగడంతో తట్టుకోలేక పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా ఉపాధ్యాయులు తరుపు మాట్లాడేసరికి చేసేది లేక విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారు. ఒక్కసారిగా 100 మంది విద్యార్థులను బస్టాండ్ లో చూసిన పోలీసులు అవాక్కయ్యారు. విషయాన్ని ఆరా తీయగా ప్రిన్సిపల్, ఇద్దరు ఉపాధ్యాయులు వేధిస్తున్నారని.. వీటిని తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోతున్నామని అని చెప్పడంతో.. అధికార యంత్రాంగం స్పందించింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో చోటు చేసుకుంది.

మండలంలోని ఎల్​బీ చర్ల బాలుర గురుకుల పాఠశాలలో 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత కొంత కాలంగా ప్రిన్సిపల్​తో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థులను ఏదో ఒక సాకు చూపించి.. బెదిరించడం,కొట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని విద్యార్థులు వాపోయారు. వీటిని తట్టుకోలేక.. చదువులు మాని ఇళ్లకు వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్కూల్ నుంచి 100 మంది విద్యార్థులు నర్సాపురం ఆర్టీసీ బస్టాండ్​కు చేరుకున్నారు. ఆ సమయంలో రోడ్డు మీద విధుల్లో ఉన్న పోలీసులు విద్యార్థులను ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వెంటనే రెవిన్యూ సిబ్బంది అప్రమత్తమై విద్యార్థుల్ని టీటీడీ కళ్యాణ మండపంకి తరలించారు. అక్కడ వారికి భోజన సదుపాయం కల్పించారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ విష్ణు చరణ్ కళ్యాణ మండపం వద్దకు వచ్చి విద్యార్థుల్ని ఆరా తీశారు. న్యాయం జరిగేలా చూస్తానని విద్యార్థులకు హామీ ఇవ్వడంతో.. వారు శుక్రవారం గురుకులానికి వెళ్లి చదువుకుంటామని చెప్పారు. అనంతరం సబ్ కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రాథమిక విచారణ ఆధారంగా ప్రిన్సిపల్ పూర్ణచందర్రావుతో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఇదీ చదవండి : తాడేపల్లిగూడెం నిట్‌లో ర్యాగింగ్ కలకలం.. విచారిస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.