పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని శ్రీ అరవింద శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల.. ఉన్నత విద్యకు జిల్లాలోనే పేరుగాంచింది. ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. అలాంటి కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మూడు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలో పనిచేసే సీనియర్ అధ్యాపకుడే.. ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించేవారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ కళాశాలకు పూర్తిస్థాయి ప్రిన్సిపాల్ లేకపోవడమే సమస్యకు ప్రధాన కారణమని సిబ్బంది చెబుతున్నారు.
మూడున్నర నెలలు పూర్తయినా.. తమ గోడు పట్టించుకునే నాథుడే లేడని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించాలని వాళ్లు వాపోయారు. కళాశాల వద్ద ఆందోళన సైతం చేపట్టారు. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సకాలంలో జీతాలు అందేలా చేయాలని తహసిల్ధార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కళాశాలలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో కలిపి మొత్తం 21 మంది పనిచేస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి:
వీరవాసరం పీఎస్‌లో నగదు మాయం కేసు: ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్