పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రాజెక్టు వద్ద అనువైన స్థలాన్ని ఇతర అధికారుల బృందం, పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్లతో కలిసి రాష్ట్ర గ్రీన్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై అధికారులతో చర్చించారు.
అన్ని ప్రాంతాలను పరిశీలించి.. ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వద్ద అతి భారీ వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు.. అందమైన పార్కును సైతం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో అధికారులు పోలవరంలో పర్యటించారు.
ఇదీ చదవండి:
కొల్లేరు మనుగడ ప్రశ్నార్థకం.. పట్టించుకోదా అధికార యంత్రాంగం?