పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాష్ట్ర సరిహద్దులో అక్రమ మద్యం తరలింపుతో పాటు వెండి, బంగారు ఆభరణాలు భారీగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సరిహద్దు వద్ద నిఘా తీవ్రం చేసిన పోలీసులు బిల్లులు లేకుండా తరలిస్తోన్న 22 కేజీల వెండి వస్తువులు పట్టుకున్నారు.
అలాగే చింతలపూడి మండలం బాలావారిగూడెం గ్రామానికి చెందిన పసుమర్తి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వద్ద బిల్లులు లేని 6 కేజీల వెండి.. 166 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో పలు గ్రామాల్లో బిల్లులు లేకుండా వెండి, బంగారు ఆభరణాలు విక్రయించి మిగిలిన ఆభరణాలను చింతలపూడికి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇదీ చూడండి..